- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన కేఎల్ రాహుల్
దిశ, స్పోర్ట్స్ : అథ్లెట్ల కెరీర్ చాలా చిన్నదని, తాను మరో 10 ఏళ్లు మాత్రమే ఆడతాననే విషయం తనకు అర్థమైందని టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదో ఒక రోజు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందేనని, ఆ విషయం తనకు అర్థమైందన్నాడు. తన రిటైర్మెంట్ ఎంతో దూరంలో లేదని, తన కెరీర్ త్వరగానే ముగుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ఫిట్‌గా ఉంటే 40 ఏళ్ల వరకు ఆడొచ్చు. 43 ఏళ్ల వయసులోనూ ధోనీ ఆడుతున్నాడు. నిజమే. ఐపీఎల్ ఆడొచ్చు. కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఆడలేం. అథ్లెట్ల కెరీర్ చిన్నది. ఆ సమయంలోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నాకు ఇప్పుడు 30 ఏళ్లు. నా కెరీర్ ముగింపును నేను చూశా. నా 30వ పుట్టిన రోజున ఇంకో 10 ఏళ్లు మాత్రమే ఆడగలనని నాకు అర్థమైంది. అప్పుడు ఆందోళన కలిగింది. ఏదో ఒక సమయంలో ముగింపు పలకాల్సిందేనని తొలిసారిగా అనుకున్నా. నా జీవితం మొత్తం క్రికెటే ఉంది. అయితే, ముగింపు ఎంతో దూరంలో లేదు.’ అని చెప్పాడు.
- Tags
- #KL Rahul