- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IND Vs ENG: టీమిండియాకు బిగ్ షాక్.. రెండో టీ20కి ఆ స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం?

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై (Chennai)లోని చేపాక్ (Chepak) స్టేడియం వేదికగా నేడు ఇంగ్లాండ్ (England)తో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు మందు టీమిండియా (Team India)కు బిగ్ షాక్ తగిలింది. ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో ఇంగ్లీష్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన స్టార్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఇవాళ్టి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. శుక్రవారం నెట్ ప్రాక్టీస్‌లో ఓపెనర్ అభిషేక్ కుడి చీలమండ బెణకడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. నొప్పితో బయటికి వెళ్లిన అతడు మళ్లీ ప్రాక్టీస్ చేసేందుకు మైదానంలోకి రాలేదు.
అయితే, అభిషేక్ గాయంపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన వెలువడలేదు. ఒకవేళ అతడు మ్యాచ్‌కు అందుబాటులో లేని పక్షంలో సంజూ శాంసన్ (Sanju Samson)కు తోడుగా తిలక్ వర్మ (Tilak Varma) లేదా ధ్రువ్ జురెల్ (Dhruv Jurel)ను జట్టు మేనేజ్‌మెంట్ బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sunder)ను కూడా తది జట్టులో ఆడించే ఛాన్స్ ఉంది. అతడికి చేపాక్ (Chepak) సొంత మైదానం కావడంతో కలిసొస్తుందని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. అయితే, ఇప్పటికే ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ముందంజలో ఉన్న నేపథ్యంలో అభిషేక్ గాయపడటం పెద్ద దెబ్బే.
అందరి చూపు షమీ వైపు..
జట్టులోకి చాలా కాలం తరువాత పునరాగమనం చేసిన మహ్మద్ షమీ (Mohammad Shami) తొలి టీ20లో ఆడలేదు. దీంతో టీమిండియా (Team India) ఫ్యాన్స్ అతడి రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇవాళ్టి మ్యాచ్‌లో అతడు బరిలో దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)కు షమీ తొడైతే ఇంగ్లాండ్ (England) బ్యాట్స్‌మెన్ల దూకుడు బ్రేక్ వేయవచ్చని కోచ్ గౌతర్ గంభీర్ (Gautam Gambhir), మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా చేపాక్ (Chepak) పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) స్థానంలో వాషింగ్టన్ సుందర్ (Washington Sunder)ను ఆడిస్తారని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.