IND Vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులోకి ఆ ముగ్గురు

by Shiva |
IND Vs AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులోకి ఆ ముగ్గురు
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా (Team India) 295 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసి మంచి జోరుమీదుంది. నేడు అడిలైడ్ (Adelaide) వేదికగా పింక్ బాల్‌తో జరగనున్న డే అండ్ నైట్ టెస్ట్‌లో టాస్ గెలిచిన భారత్ (India) మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, విన్నింగ్ స్టీ్క్ కొనసాగించాలని ఓవైపు రోహిత్ సేన ఉవ్విళ్లూరుతుంటే మరో వైపు అడిలైడ్ టెస్ట్‌ (Adelaide Test)లో ఎలాగైన విజయం సాధించి సిరీస్ సమం చేయాలని ఆసిస్ భావిస్తోంది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) తుది జట్టులో చేరడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అతడు లేకపోయినా కొండంత ఆత్మ విశ్వాసంతో జట్టు సారథిగా బుమ్రా అదరగొట్టాడు. జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.

మరోవైపు ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal), కేఎల్ రాహుల్ (KL Rahul), విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్‌లోకి రావడం ఆసిస్‌కు పెద్ద దెబ్బే అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. రెండు టెస్ట్‌లో టీమిండియా (Team India) తుది జట్టులో 3 మార్పులతో బరిలోకి దిగుతోంది. పడిక్కల్ (Padikkal) స్థానంలో రోహిత్ శర్మ, ధృవ్ జూరెల్ (Dhruv Jurel) ప్లేస్‌లో శుభ్‌మన్ గిల్, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తుది జట్టులో చేరారు. ఇక ప్రత్యర్థి ఆస్ట్రేలియా (Australia) జట్టు ఒక్కే ఒక్క మార్పుతో రంగంలోకి దిగుతోంది. గాయం కారణంగా వైదొలిగిన హేజిల్‌వుడ్ (Hazlewood) స్థానంలో స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి వచ్చాడు.

వరుణుడు.. కరుణిస్తాడా..

రెండో టెస్టుకు వరుణుడి గండం ఉంది. అడిలైడ్‌ (Adelaide)లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుంది. మధ్యాహ్నం వర్షం (Rain) ఆటకు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం 12 గంటలకు ఆకాశం మేఘావృతమై వర్షం పడేందుకు 47 శాతం అవకాశం ఉంది. అదేవిధంగా, ఒంటి గంటకు ఉరుములతో కూడిన వర్షం పడేందుకు 51 శాతం అవకాశం ఉంది.

భారత జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), రోహిత్ శర్మ(C), నితీష్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(WK), పాట్ కమిన్స్ (C), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్

Next Story

Most Viewed