అతడే మా ఓటమిని శాసించాడు : ప్యాట్ కమ్మిన్స్

by Shiva |   ( Updated:2023-02-11 12:52:06.0  )
అతడే మా ఓటమిని శాసించాడు : ప్యాట్ కమ్మిన్స్
X

నాగ్‌పూర్: భారత స్పిన్నర్ల అసాధారణ బౌలింగ్, రోహిత్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్.. తమ ఓటమిని శాసించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన వికెట్‌పై రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో తమను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టాడని తెలిపాడు. శనివారమే ముగిసిన తొలి టెస్ట్‌లో సమష్టిగా విఫలమైన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కమిన్స్.. తమ ఓటమికి గల కారణాన్ని వెల్లడించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మరో 100 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ఇక భారత జట్టు అసాధారణ ప్రదర్శన కనబర్చిందని ప్రశంసించాడు.

భారత్ పిచ్ లపై బ్యాటింగ్ కత్తి మీద సాము..

టీమిండియా చాలా అద్భుతంగా ఆడిందని, టర్నింగ్ వికెట్లపై భారత స్పిన్నర్లు ఎప్పుడూ రాణిస్తారని గుర్తు చేశాడు. రోహిత్ శర్మ తనదైన క్లాస్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడని కితాబిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌పై టర్న్ ఉన్నప్పటికీ.. మొదటి ఇన్నింగ్స్‌లో మరో 100 పరుగులు చేసుంటే భారత్‌పై కాస్త ఒత్తిడి ఉండేదని అన్నాడు. నిజానికి భారత్‌ పిచ్ లపై బ్యాటింగ్ చేయడమంటే కత్తి మీద సామేనని తెలిపాడు. అయితే తమ జట్టులోని ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్‌లో సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశారని తెలిపారు. ఆ ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయాల్సి ఉందని తెలిపారు. టాడ్ మర్ఫీ తన మొదటి మ్యాచ్ లోనే చక్కచి బౌలింగ్ తో అకట్టుకున్నాడని ప్రశంసించాడు.

Advertisement

Next Story

Most Viewed