- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Team India :బేసిక్స్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేయండి.. టీంఇండియాకు కపిల్ దేవ్ సజిషన్
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీంఇండియా 0-3తో వైట్ వాష్ అయిన తర్వాత భారత బ్యాటింగ్ లైన్‌అప్‌పై వరుసగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా మెజార్టీ బ్యాటర్లు స్పిన్ ఆడేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇండియన్ క్రికెట్ టీంకి ఓ అడ్వైస్ ఇచ్చారు. బేసిక్‌కు వెళ్లి ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలని పిలుపునిచ్చాడు. రూమ్‌లో కూర్చొని ఇంప్రూవ్ అవుతామంటే కుదరదన్నాడు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పదునెక్కుతారని సూచించాడు. మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ ఇటీవల మాట్లాడుతూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1 తేడాతో గెలుస్తుందని జోస్యం చెప్పాడు. మహమ్మద్ షమి లేకుండా 20 వికెట్లు తీయడం ఇండియాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్నాడు. 2014-15 నుంచి భారత్ వరుసగా నాలుగు సార్లు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోగా ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.