Gautam Gambhir: 'బ్యాటింగ్‌ విషయంలో ఎలాంటి సందేహం.. కానీ బౌలర్లే'

by Vinod kumar |   ( Updated:2023-09-13 10:11:12.0  )
Gautam Gambhir: బ్యాటింగ్‌ విషయంలో ఎలాంటి సందేహం.. కానీ బౌలర్లే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం లంక స్పిన్‌ దాటికి టీమిండియా ఆలౌటైన విషయం తెలిసిందే. టీమిండియా టాప్ ఆర్డర్ గిల్‌, కోహ్లి, రాహుల్‌ విఫలం కావడంతో కేవలం 213 పరుగులు మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో.. భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్‌పై భారీ విజయం కంటే శ్రీలంక మీద 'లో స్కోరింగ్‌' మ్యాచ్‌లో గెలుపే టీమిండియాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. ‘‘పాకిస్తాన్‌ మీద 228 పరుగుల తేడాతో భారీ విజయం కంటే శ్రీలంక మీద గెలుపే భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. మన బ్యాటింగ్‌ విషయంలో ఎలాంటి సందేహం తావులేదు. అయితే గాయం తర్వాత తిరిగొచ్చిన జస్‌ప్రీత్‌ బుమ్రా.. ఎలా ఆడతాడు? కుల్దీప్‌ యాదవ్‌.. ఇతర బౌలర్లు ఏ మేరకు రాణిస్తారనే ఆందోళన ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో కొలంబో పిచ్‌పై 213 పరుగులు స్కోరు కాపాడుకోవడం సానుకూలాంశం. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల శ్రీలంకపై ఇలాంటి గెలుపు వరల్డ్‌కప్‌నకు ముందు టీమిండియాకు బూస్ట్‌ను ఇస్తుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed