బ్రేకింగ్: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. తీవ్ర ఉత్కంఠకు తెరదించిన BCCI

by Satheesh |   ( Updated:2024-07-09 15:19:20.0  )
బ్రేకింగ్: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. తీవ్ర ఉత్కంఠకు తెరదించిన BCCI
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు బీసీసీఐ తెరదించింది. ఎట్టకేలకు టీమిండియా నెక్ట్స్ హెడ్ కోచ్ నేమ్‌ను అనౌన్స్ చేసింది. భారత మాజీ స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా అధికారికంగా గంభీర్ పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కాగా, టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం జూన్ 30తో ముగిసింది. దీంతో బీసీసీఐ నెక్స్ట్ భారత్ కోచ్ కోసం వేట మొదలుపెట్టి ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించింది. ఈ పదవికి దరఖాస్తు చేసుకున్న గౌతీ.. ఇంటర్వ్యూకు సైతం హాజరయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతాను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్ పేరు టీమిండియా హెడ్ కోచ్ రేసులో మొదటి నుండి ముందు వరుసలోనే ఉంది.

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఫిక్స్ అయిందని.. అధికారిక ప్రకటనే తరువాత అని గత కొద్ది రోజులుగా క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ టీమిండియా నెక్ట్స్ హెడ్ కోచ్‌గా గంభీర్ పేరును బీసీసీఐ అఫిషియల్‌గా ప్రకటించింది. భారత్‌ను ఎన్నో మ్యాచుల్లో ఒంటి చేత్తో గెలిపించడంతో పాటు ఐపీఎల్‌లో కోల్‌కతా, లక్నో మెంటార్‌గా గంభీర్ ఎక్స్‌పీరియన్స్‌ను పరిగణలోకి తీసుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా టీమిండియా నెక్స్ట్ హెడ్ ఎవరన్న నరాలు తెగే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాగా, ద్రావిడ్ నేతృత్వంలోని టీమిండియా ఇటీవల జరిగిన టీ-20 వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ గెల్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed