న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్‌కు క్యాన్సర్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన

by Disha News Desk |
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్‌కు క్యాన్సర్.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన
X

ఆక్లాండ్ : న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కెయిర్న్స్ అధికారికంగా ప్రకటించాడు. అయితే, కేవలం ఒక వారం ముందు అతను గుండెపోటు, పారాప్లేజియా కారణంగా కాన్‌బెర్రాలోని ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా కెయిర్న్స్ మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగుండటం లేదని ఆస్పత్రికి వెళ్లగా తనకు పేగు క్యాన్సర్ ఉందని వైద్యులు చెప్పినట్టు వివరించాడు.

రొటీన్ చెకప్ అనంతరం కెయిర్న్స్ తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో తనకు క్యాన్సర్ అని తేలినట్లు పోస్ట్ పెట్టాడు. కెయిర్న్స్ 1989-2006 మధ్య న్యూజిలాండ్ తరపున 62 టెస్టులు, 215 వన్డేలు ఆడాడు. అంతేకాకుండా రెండు టీములకు ఆడాడు. ఈ ఆల్‌రౌండర్ 33 కంటే ఎక్కువ సగటుతో 3,320 టెస్ట్ పరుగులు, 29 కంటే ఎక్కువ సగటుతో 218 వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ లాన్స్ కెయిర్న్స్ కుమారుడే ఈ క్రిస్ కెయిర్న్స్.

Advertisement

Next Story

Most Viewed