రోహిత్‌కు కపిల్ దేవ్ మద్దతు.. విమర్శకులకు కౌంటర్

by Harish |
రోహిత్‌కు కపిల్ దేవ్ మద్దతు.. విమర్శకులకు కౌంటర్
X

దిశ, స్పోర్ట్స్ : అడిలైడ్ టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలువురి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో భారత సారథికి మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ మద్దతుగా నిలిచాడు. సోమవారం ఓ ఈవెంట్‌లో పాల్గొన్న కపిల్ మీడియాతో మాట్లాడుతూ.. రోహిత్ నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. జట్టును నడిపించడం సవాళ్లు ఉంటాయని, ఒకటి రెండు పేలవ ప్రదర్శన ఆధారంగా కెప్టెన్‌ను ప్రశ్నించాల్సిన అవసరం లేదని చెప్పాడు.

‘రోహత్ చాలా ఏళ్లుగా ఎంతో చేశాడు. అతని మీద నాకు అనుమానం లేదు. తిరిగి ఫామ్ అందుకుంటాడని ఆశిస్తున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ముఖ్యం. గతంలో బాగా చేసినా ఒకటి రెండు పేలవ ప్రదర్శనలు చేసిన తర్వాత కొందరు విమర్శించడం ప్రారంభిస్తారు. ఆరు నెలల క్రితం అతను టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు నన్ను ఎవరూ ఈ ప్రశ్న అడగలేదు. అతను రాణించకపోతే అక్కడ ఉండడు. కానీ, అతని సామర్థ్యం, ప్రతిభ తెలుసుకుని పుంజుకుంటాడు.’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed