- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌పై దినేష్ కార్తీక్ సంచలన కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ జట్టు యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన అద్బుత ప్రదర్శనతో అందరిని అకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్ 625 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచురీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ జట్టులో కూడా అతడికి అవకాశం ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. దీనిపై టీమ్ ఇండియా ప్లేయర్ దినేష్ కార్తీక్ కీలక కామెంట్స్ చేశాడు. వన్డే వరల్డ్‌కప్ వంటి బిగ్ ఈవెంట్‌కు జైశ్వాల్‌ను ఎంపికచేయాలి అనడం తొందరపాటే అవుతుందని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
అంతర్జాతీయ క్రికెట్ అన్నింటికంటే పూర్తి భిన్నంగా ఉండటంతో పాటుగా చాలా ఒత్తిడి ఉంటుందని కార్తీక్ పేర్కొన్నాడు. వన్డే జట్టులోకి యశస్వీని ఇంత వేగంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. అతడికి ప్రస్తుతం కేవలం 21 ఏళ్లు మాత్రమే. జైశ్వాల్‌కు చాలా భవిష్యత్తు ఉంది. అతడొక స్పెషల్ ప్లేయర్. కాబట్టి అతడిని ముందు భారత టీ20 జట్టులో భాగం చేయండని కార్తీక్ సూచించాడు.