Champions Trophy-2025: సెమీస్‌కు చేరిన టీమిండియా.. ప్యాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
Champions Trophy-2025: సెమీస్‌కు చేరిన టీమిండియా.. ప్యాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025)లో భారత్ (India) విజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఈనెల 20న టీమిండియా (Team India) బంగ్లాదేశ్‌ (Bangladesh)‌పై జరిగిన మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో, 23న పాకిస్థాన్‌ (Pakistan)తో రెండో మ్యాచ్‌లో కూడా ఆరు వికెట్ తేడాతో ఘన విజయం సాధించి దర్జాగా సెమీస్‌ ఫైనల్ (Semi Final)లో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే, భద్రతా కార‌ణాల దృష్ట్యా బీసీసీఐ (BCCI) ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం భారత జట్టును అతిథ్య దేశం పాకిస్థాన్‌ (Pakistan)కు పంపించేందుకు నిరాక‌రించ‌డంతో టోర్నీని ఐసీసీ (ICC) హైబ్రిడ్ మోడల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టీమిండియా (Team India) త‌న మ్యాచ్‌లు అన్ని దుబాయ్ (Dubai) వేదిక‌గానే కొనసాగుతున్నారు.

ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా (Australia) ఆటగాడు ప్యాట్ కమిన్స్ (Pat Cummins) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ (Champions Trophy)లో భాగంగా టీమిండియా దుబాయ్‌ (Dubai)లోని ఒకే స్టేడియంలో అన్ని మ్యాచ్‌లను కలిసొచ్చే అంశమని అన్నారు. ఇప్పటికే ఆ జట్టు అన్ని జట్ల కంటే భీకరంగా ఉందని కామెంట్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో అందరి హాట్ ఫేవరెట్ ఇండియా అని ప్యాట్ కమిన్స్ తెలిపారు. అయితే, గాయం కార‌ణంగా కమిన్స్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నానని.. మరో వారం రోజుల్లో బౌలింగ్ ప్రాక్టీస్‌ ప్రారంభిస్తానని తెలిపాడు. రాబోయే నెలలో ఐపీఎల్ (IPL), అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship), వెస్టిండీస్ (West Indies) పర్యటన ఉందని కమిన్స్ అన్నాడు.

Next Story