ఐపీఎల్‌లో SRH‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరమయ్యే ఛాన్స్?

by Shiva |   ( Updated:2024-02-22 13:01:41.0  )
ఐపీఎల్‌లో SRH‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరమయ్యే ఛాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ మొదలవుతున్న వేళ సన్‌రైజర్స్ యాజమాన్యానికి బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాడు అభిషేక్ శర్మ అనుకోని విధంగా చిక్కుల్లో పడ్డాడు. ఇటీవలే గుజరాత్‌కు చెందిన తానియా సింగ్ (23) అనే మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆ కేసులో అభిషేక్ శర్మను పోలీసులు విచారణకు రావాలని ఆదేశించినట్లుగా సమాచారం. ఫిబ్రవరి 20న రాత్రి తానియా సింగ్(28) అనే మోడల్ ఆత్మహత్య చేసుకుంది.

సూరత్‌లోని హ్యాపీ ఎలిగెన్స్ అపార్ట్‌మెంట్లో ఉన్న తన ఇంట్లోనే తానియా ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రస్తుతం ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే దానిపై పోలీసులు విచరాణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ జట్టులో కీలక ప్లేయర్ అభిషేక్ శర్మను పోలీసులు విచారణకు పిలిచారు. అయితే తానియాకు, అభిషేక్‌కు మధ్య ఉన్న రిలేషన్ ఎంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమిక విచారణలో భాగంగా ఆమె స్నేహితులందరి పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం.

Advertisement

Next Story