దులీప్ ట్రోఫీకి ముందు టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరు స్టార్లు దూరం

by Harish |
దులీప్ ట్రోఫీకి ముందు టీమిండియాకు భారీ షాక్.. ఆ ఇద్దరు స్టార్లు దూరం
X

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీకి టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ దూరమయ్యారు. అనారోగ్యం కారణంగా సిరాజ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. దీంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అతని స్థానంలో నవదీప్ సైనీని భర్తీ చేసింది. అలాగే, జడేజా సైతం టోర్నీ నుంచి తప్పుకున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్ నాటికి మరింత విశ్రాంతి కావాలని అతను కోరినట్టు తెలుస్తోంది. జడేజా స్థానాన్ని ఇంకా ఎవరితో భర్తీ చేయలేదు.

ఈ నెల 5 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభంకానుంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా భావిస్తున్న టోర్నీకి సిరాజ్, జడేజా దూరమవడం ఆందోళన కలిగిస్తున్నది. రోహిత్, కోహ్లీ, బుమ్రా, అశ్విన్ మినహా మిగతా ప్లేయర్లందరూ దులీప్ ట్రోఫీ ఆడాల్సిందేనని బోర్డు ప్లేయర్లకు ఆదేశాలు జారీ చేసింది. టోర్నీని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇప్పటికే తొలి రౌండ్‌కు జట్లను ప్రకటించింది. దులీప్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగానే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు.

Advertisement

Next Story