Breaking: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. షెడ్యూల్ విడుదల

by GSrikanth |   ( Updated:2022-03-13 05:44:40.0  )
Breaking: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఫ్యాన్స్‌కు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఐపీఎల్‌- 2022 సీజన్‌‌కి సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేసింది. మార్చి 26న మొదటి మ్యాచ్‌ జరగనుండగా, మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. కాగా, ఈ ఐపీఎల్‌-15 సీజన్ మొత్తం 65 రోజుల పాటు జరగనుంది. మొత్తం 70 లీగ్‌ మ్యా్‌చ్‌‌లు జరుగనున్నాయి. మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మే 22న చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. ముంబయిలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్ లు చొప్పున జరగనుండగా… పుణేలోని ఎంసీఏ స్డేడియంలో, ముంబైలోని బ్రబోర్న్ స్టేడియాల్లో 15 మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. మొదటి మ్యాచ్‌‌లో ఏప్రిల్ 28న ముంబైలోని వాంఖడే మైదానంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రన్నరప్‌ కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తలపడనున్నాయి. మే 22న హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే పోరుతో లీగ్ పోరు ముగుస్తుంది.

Advertisement

Next Story