ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో తెలియదు : జట్టులో విభేదాలపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Harish |
ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో తెలియదు : జట్టులో విభేదాలపై అక్షర్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు తలెత్తాయని, కోచ్‌లు, ప్లేయర్ల మధ్య కమ్యూనికేషన్ దెబ్బతిన్నదని వస్తున్న వార్తలపై భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్పందించాడు. సోమవారం కోల్‌కతాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అక్షర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో తనకు తెలియదని, ఇప్పుడైతే అంతా బాగానే ఉందని చెప్పాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు అక్షర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించిన వియం తెలిసిందే. ‘సపోర్టింగ్ స్టాఫ్‌తో కమ్యూనికేషన్ బాగానే ఉంది. గత రెండున్నర నెలలుగా నేను జట్టుతో లేను. కాబట్టి, ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో నాకు తెలియదు. ప్రస్తుతం సపోర్టింగ్ స్టాఫ్, జట్టులో వాతావరణం అంతా బాగానే ఉంది. మాకు ఏవైనా ఇన్‌పుట్స్ కావాలంటే బ్యాటింగ్ లేదా బౌలింగ్ కోచ్‌తో మాట్లాడుతాం. టీ20 గేముల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. ఎక్కువగా మేము ఆ విషయాల గురించి, జట్టులో తమ పాత్ర గురించి చర్చిస్తాం.’ అని అక్షర్ చెప్పుకొచ్చాడు.




Next Story

Most Viewed