- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Spice Jet : విమానయాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన ప్రయాణికులకు కొత్త సౌకర్యాలను తీసుకొచ్చినట్టు వెల్లడించింది. విమానాశ్రయంలో దిగిన తర్వాత క్యాబ్‌లను బుక్ చేసుకునే సమయాన్ని తగ్గించేందుకు ప్రయాణంలో ఉండగానే క్యాబ్ బుక్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. సంస్థ ఆన్‌బోర్డ్ సేవలైన ‘స్పైస్‌స్క్రీన్’ ద్వారా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టామని, ముందుగా ఈ సేవలను గురువారం నుంచి ఢిల్లీలో ప్రారంభించినట్టు తెలిపింది. అనంతరం దశలవారీగా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, గోవా, పూణె, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాలకు విస్తరించనున్నట్టు పేర్కొంది.
వినియోగదారులు తమ ప్రయాణం, వేచి ఉండే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యాలను ప్రవేశపెట్టినట్టు స్పైస్‌జెట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, 2020, ఇదే నెలలో స్పైస్‌జెట్ సంస్థ స్పైస్ స్క్రీన్ ఆన్‌బోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో వైర్‌లెస్ నెట్‌వర్క్ సదుపాయాలను ప్రారంభించింది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్‌లతో కనెక్ట్ చేసుకుని క్యాబ్‌ను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. క్యాబ్ బుకింగ్ అయిన తర్వత మెసేజ్/వాట్సాప్‌కు ఓటీపీ వినియోగదారులకు వస్తుంది. క్యాబ్ సేవలు వినియోగిచుకున్న తర్వాత చెల్లింపులు పూర్తిచేయవచ్చు. అంతేకాకుండా క్యాబ్ బుకింగ్‌లకు సంబంధించి ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్లను సైతం ఇస్తున్నామని, ఏదైనా కారణంతో క్యాబ్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవని స్పైస్‌జెట్ వెల్లడించింది.