రాకెట్ సమస్య వల్ల ఆగిన డ్రాగన్ కార్గో డెలివరీ

by Harish |
రాకెట్ సమస్య వల్ల ఆగిన డ్రాగన్ కార్గో డెలివరీ
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఫాల్కన్ 9 రాకెట్‌లో తలెత్తిన సమస్య కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరాల్సిన డ్రాగన్ కార్గో షిప్ డెలివరీని కనీసం నాలుగు రోజుల పాటు ఆపబోతున్నట్లు స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది. ఫ్లోరిడా స్పేస్ కోస్ట్ నుంచి సోమవారం (మార్చి 2) బయల్దేరాల్సిన ఈ కార్గోని, మార్చి 6న పంపించనున్నట్లు తెలిపింది. ఫాల్కన్ 9 రాకెట్‌లోని అప్పర్ స్టేజ్ వాల్వ్ మోటార్‌లో సమస్య కారణంగా ఆలస్యం చేస్తున్నట్లు వెల్లడించింది.

తమ ప్రాథమిక పరిశీలనలో సెకండ్ స్టేజ్ వాల్వ్ మోటార్ ఇంజిన్ అనుకున్న రీతిలో పనిచేయడం లేదని గమనించినట్లు స్పేస్ ఎక్స్ ప్రతినిధులు చెప్పారు. దాన్ని సరిచేయడానికి నాసా వారి అనుమతి తీసుకుని విజయవంతంగా రాకెట్ లాంచ్ చేస్తామని అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఎక్స్‌పెడిషన్ 62 బృంద సభ్యులు ముగ్గురికి ఈ డ్రాగన్ కార్గో షిప్ ఆహారాన్ని, ఇతర సైన్స్ పరికరాలను తీసుకెళ్లనుంది. వీటన్నిటి బరువు కలిపి 2540 కేజీలు ఉంటుంది. ఈ మిషన్‌కి సీఆర్‌ఎస్ 20 అని పేరు పెట్టారు. నాసా పరిధిలో స్పేస్ ఎక్స్ నిర్వహిస్తున్న 20 కార్గో డెలివరి ఇది.

Advertisement

Next Story

Most Viewed