వలస కూలీలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు

by Shyam |
వలస కూలీలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు
X

దిశ, మహబూబ్‎నగర్: లాక్‎డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల రాకపోకలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు చొరవ చూపాలని ఆదేశించారు. శనివారం దేవరకద్ర మండలం బసవయ్యపల్లెలో వలస కార్మికులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కార్మికులతో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఉంటున్న వలస కార్మికుల సంక్షేమం పట్ల పోలీసుశాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వస్థలాలకు వెళ్ళాలనుకుంటున్న కార్మికుల కోసం రైలు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కార్మికుల నిర్ణయం మేరకు పోలీసుశాఖ సహాయం చేస్తుందని ఎస్పీ రెమా రాజేశ్వరి స్పష్టం చేశారు.

Advertisement

Next Story