టోల్‌ప్లాజా వద్ద ఎస్పీ తనిఖీలు

by Aamani |

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని గంజల్ టోల్‌ప్లాజా వద్దనున్న చెక్‌పోస్ట్‌ను ఎస్పీ శశిధర్ రాజు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి పోలీసు సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్లపై అహర్నిశలు విధులు నిర్వహిస్తూ వైరస్ నియంత్రణలో తమవంతు పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags: adilabad SP, checking, Toll Plaza, coronavirus, police



Next Story

Most Viewed