- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవార్డుల రారాజు : ఎస్పీ
దిశ వెబ్ డెస్క్:
ఎస్పీ బాలుకు కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ,, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. ఇక తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అనేక పురస్కారాలను అందుకున్నారు. 2012 లో ఆయన నటించిన ‘మిథునం’ సినిమాకు ‘నంది’ ప్రత్యేక బహుమతి లభించింది. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆరు జాతీయ పురస్కారాలను ఆయన అందుకున్నారు. దక్షిణాది నుంచి ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను, జాతీయ స్థాయిలో మరో ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు.
కర్ణాటక సంగీత ఇతివృత్తంగా 1979లో విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రానికి పాటలు పాడినందుకు బాలుకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత 1981లో బాలీవుడ్‌లో ప్రవేశించే అవకాశం లభించింది. కమల్ హాసన్ నటించిన ‘ఏక్ దూజే కే లియే’ చిత్రానికి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు కూడా బాలుకు జాతీయ పురస్కారాలు లభించాయి. 25 సార్లు ఉత్తమ గాయకుడి అవార్డులతో పాటు ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా ‘నంది’ పురస్కారాలను అందుకున్నారు. మొత్తం 29 సార్లు వివిధ విభాగాల్లో ‘నంది’ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి ఎస్పీ బాలు.
1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రంగరాజన్ చేతుల మీదుగా పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్నారు. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నాలుగేళ్ళ క్రితం ఆయన చేతులమీదుగా శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ (సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2016) పురస్కారాన్ని అందుకున్నారు.