- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషమంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణ పౌరుల నుంచి కేంద్ర హోంమంత్రి, మాజీ రాష్ట్రపతి సైతం ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి నుంచి ప్రజలను రక్షించేందుకు విధుల్లో నిమగ్నమైన కరోనా వారియర్లుతో సహా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇదిలాఉండగా, సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా సోకిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా సోకడంతో కొద్దిరోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు ఎస్పీ చెప్పారు. కాగా, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో శుక్రవారం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story