దాదాకు ఎంఫాన్ తుఫాను కష్టాలు

by Shamantha N |   ( Updated:2020-05-22 07:02:47.0  )
దాదాకు ఎంఫాన్ తుఫాను కష్టాలు
X

కోల్‌కాతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఎంఫాన్ తుఫాను కష్టాలను తెచ్చిపెట్టింది. తుఫాను ప్రభావం పశ్చిమ బంగాల్, ఒడిషాలలో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోల్‌కాతాలోని బెహాలా ప్రాంతంలో ఉంటున్న గంగూలీ ఇంటి ఆవరణలో పెనుగాలులకు ఒక మామిడి చెట్టు విరిగిపడింది. లాక్‌డౌన్ కారణంగా సహాయం చేయడానికి ఎవరూ లేకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగి, విరిగిన కొమ్మలను కొట్టేసి.. మామిడి చెట్టును తాళ్లతో పైకి లేపి యథాస్థితికి తీసుకొని వచ్చాడు. ఈ వివరాలను గంగూలీ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసుకున్నాడు.

Advertisement

Next Story