గంగూలీని కెప్టెన్ చేయడానికి చాలా కష్టడ్డాం: మాజీ సెలెక్టర్

by Shyam |
గంగూలీని కెప్టెన్ చేయడానికి చాలా కష్టడ్డాం: మాజీ సెలెక్టర్
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు ఫిక్సింగ్ ఆరోపణలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కెప్టెన్సీకి సచిన్ టెండూల్కర్ రాజీమానా చేశారు. ఆ సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఉన్నత శ్రేణి జట్టుగా తీర్చిదిద్దాడు. అయితే, గంగూలీని వైస్ కెప్టెన్‌గా, ఆ తర్వాత కెప్టెన్‌గా చేయడానికి కష్టపడాల్సి వచ్చిందని అప్పటి సెలక్షన్ కమిటీ సభ్యుడు, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ మల్హోత్ర తెలిపారు. స్పోర్ట్స్ కీడా అనే క్రీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ మల్హోత్ర ఈ విషయాలను వెల్లడించారు. అప్పట్లో వైస్ కెప్టెన్ కోసం సెలెక్షన్ ప్యానల్‌లో ముగ్గురు సభ్యులు ఉన్నాం. అందరూ గంగూలీకే అనుకూలంగా ఓటేసినా అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియలో జోక్యం చేసుకున్నారు. మరోసారి ఆలోచించాలని సూచించాడు. దీంతో ఒక సెలెక్టర్ ఓటును ఉపసంహరించుకున్నాడు. అంతేకాకుండా బీసీసీఐ చైర్మన్ నిర్ణయాన్నే పరిగణనలోకి తీసుకోవాల్సి రావడంతో వైస్ కెప్టెన్‌ని చేయలేకపోయం. కానీ, ఆ తర్వాత అందరినీ ఒప్పించి వైస్ కెప్టెన్‌ని చేశాం. ఇక కెప్టెన్‌ని చేయడానికి రేసులో ఉన్న సీనియర్లు కుంబ్లే, అజయ్ జడేజా ఉన్నారు. వారిద్దరినీ ఒప్పించి దాదాకు కెప్టెన్సీ ఇచ్చాం. ఇలా ప్రతి దశలో దాదాకు ఎన్నో అడ్డంకులు వచ్చినా కెప్టెన్ అయ్యాక జట్టును మరోస్థాయికి తీసుకెళ్లడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అశోక్ మల్హోత్ర చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed