అన్‎లాక్ 4.0లో ఎస్ఓపీ విడుదల..!

by Shamantha N |
అన్‎లాక్ 4.0లో ఎస్ఓపీ విడుదల..!
X

దిశ వెబ్‎డెస్క్: అన్‎లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)ని విడుదల చేసింది. 15 మెట్రో రైల్ కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో చర్చించిన కేంద్రం ఎస్‎ఓపీని నిర్ణయించింది. సెప్టెంబర్ ఏడు నుంచి ఒకటి కంటే ఎక్కువ లైన్లలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 12 నాటికి అన్ని కారిడార్లు పని చేయనున్నాయి. అయితే కేంద్రం ఆదేశాల మేరకు కంటైన్‎మెంట్ జోన్లలో అన్ని స్టేషన్లు మూసివేసే ఉంటాయి.

ఇక మెట్రో స్టేషన్‎లోకి ప్రవేశించేటప్పుడు ప్రయాణికులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. లోపలికి ప్రవేశించేటప్పుడు ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. కోవిడ్ లక్షణాలు లేనివారికే స్టేషన్‎లోకి అనుమతిస్తారు. నగదు రహిత లావాదేవీల కోసం స్మార్ట్ కార్డుల వినియోగాన్ని ప్రొత్సహించనుంది.

Advertisement

Next Story

Most Viewed