- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
21రోజుల లాక్ డౌన్ స్వాగతిస్తున్నాం: సోనియాగాంధీ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు (మూడు వారాలు) లాక్ డౌన్ విధిస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వాగతించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆమె ప్రధాని మోడీకి లేఖ రాశారు. కరోనా పై పోరులో ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు ఎనిమిది సూచనలను అందులో పొందుపరిచారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వైరస్ నుంచి కాపాడుకునేందుకు అవసరమైన ఉత్పత్తుల సరఫరాకు లోటు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఐసీయూ, వెంటిలేటర్ల నిర్మాణాలకు సంబంధించిన సమాచారం, గుర్తింపు పొందిన హాస్పిటల్స్ వివరాలను ఒక వెబ్ పోర్టల్ లో పొందుపరిచి అందరికీ అందుబాటులోకి తేవాలని కోరారు. సామాజిక భద్రతలో భాగంగా ఫ్యాక్టరీ, నిర్మాణ రంగ కార్మికులు, రోజువారి కూలీలు, వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, ఇతర అణగారిన వర్గాలకు నేరుగా డబ్బు అందేలా(డైరక్ట్ క్యాష్ ట్రాన్స్ ఫర్) చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని రకాల ఈఎంఐలను ఆరు నెలల వరకు వాయిదా వేయాలని, ఆ కాలంలో బ్యాంకు వడ్డీలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Tags: Lockdown, pm modi, congress, sonia gandhi, letter, measures, coronavirus, contain