- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా సోకిందని తల్లిని బస్టాండ్లో వదిలేసిన కొడుకు
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. కన్నపేగు బంధాన్ని కూడా తెంచుతోంది. కరోనా సోకిందని తల్లిని బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయాడు ఆమె కొడుకు. వృద్ధురాలని, కన్నతల్లని కూడా కనీస జాలీ,దయ లేకుండా రోడ్డుపై వదలేశాడు. ఈ ఘటన గురువారం గుంటూరులోని మాచర్లలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. ఇటీవల ఓ వృద్ధురాలు గోవా నుంచి మాచర్లలో ఉండే కొడుకు వద్దకు వచ్చింది. ఐతే ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. పాజటివ్ వచ్చింది. తల్లికి కరోనా సోకడంతో భయపడిపోయిన కుమారుడు.. ఆమెను తిరిగి గోవాకు వెళ్లిపోవాలని చెప్పాడు. ఆమె వినకపోవడంతో బలవంతంగా తీసుకెళ్లి బస్టాండ్‌లో వదిలిపెట్టాడు.
బస్టాండ్‌లో ఒంటరిగా కూర్చున్న వృద్దురాలిని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆమె కుమారుడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లికి కరోనా సోకవడంతో కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్ చేస్తారన్న భయంతోనే అలా చేసినట్టు అతడు పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం వృద్ధురాలికి ఓ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.