- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాన్న నీకు నేనున్నా.. మండుటెండలో తండ్రి కాళ్లపై పడుకోబెట్టుకుని..!
దిశ, జడ్చర్ల : అసలే మండుటెండ.. ఓ పక్క బరువుతో కాళ్లు లాగుతున్నా.. పంటి బిగువన బాధనంతా ఓర్చుకున్నాడా బాలుడు.. మద్యం మత్తులో ఒళ్లు తెలియక రోడ్డుపై పడిపోయిన తండ్రిని కాళ్లపై పడుకోబెట్టుకుని.. తండ్రిని రక్షించుకున్నాడు ఆ కుమారుడు. హృదయవిదాకరమైన ఈ దృశ్యం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం కన్యకాపరమేశ్వరి వీధిలో మంగళవారం వెలుగుచూసింది. మద్యం మత్తులో తూలుతున్న తండ్రికి ఇబ్బంది కలగకూడదనుకున్నాడో.. ఏమో మరి మండుటెండలో చెమటలు కక్కుతున్నా లెక్కచేయకుండా కొన్ని గంటల పాటు తన కాళ్లపైనే పడుకోబెట్టుకున్నాడు.
జడ్చర్ల మండలం కొత్త తండాకు చెందిన మన్య నాయక్ తన బైక్ రిపేర్ కోసం జడ్చర్లకు కొడుకు హరీష్‌తో కలసి వచ్చాడు. కొద్దిసేపటికే.. పక్కనే ఉన్న వైన్స్ షాపులో మద్యం తాగి తూగుతూ వచ్చి కింద పడిపోయిన తండ్రిని చూసి ఏమీ చేయలేక.. రోడ్డు పక్కనే కాలు చాచి తండ్రిని కాళ్లపై పడుకోబెట్టుకున్నాడు. గంటలు గడుస్తున్నా తండ్రికి మెళుకువ రాకపోయినా.. కాళ్లు లాగుతున్నా ఆ కొడుకు తండ్రిని మాత్రం విడవలేదు. తన తండ్రికి మద్యం మత్తు దిగాకే.. ఇద్దరు ఇంటికి బయలుదేరారు. తండ్రిని కుమారుడు తల్లిలా సాకటం చూసి.. స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.