- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాలిడరిటీ కప్‌కు కరోనా అడ్డంకి
దిశ, స్పోర్ట్స్: క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) 3టీ ఫార్మాట్‌లో నిర్వహించనున్న సాలిడరిటీ కప్‌కు కరోనా అడ్డంకిగా మారింది. జూలై 18న సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ నిర్వహించనుంది. ఇందులో పాల్గొనే ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక, స్టేడియం సిబ్బంది, అంపైర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో ఆటగాళ్లు ఎవరూ లేరని సీఎస్ఏ స్పష్టం చేసింది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను ఈసారి కచ్చితంగా జరిపి తీరుతామని సీఎస్ఏ చెబుతున్నది. కీలకమైన సభ్యులు ఎవరికీ కరోనా సోకలేదని, పరీక్షల్లో నిర్థారించిన వారి బదులుగా ఇతరులను తీసుకుంటామని, అయితే వారికి కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాతే వేదికకు అనుమతిస్తామని సీఎస్ఏ చెబుతున్నది. ఈ మ్యాచ్‌ను ఆదివారం స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.