యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ‘సోలంకి’

by Shyam |
sollanki
X

దిశ, నారాయణపేట : బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులుగా సోలంకి శ్రీనివాస్ నాయక్ ఎన్నిక కావడంపై యువమోర్చా నియోజకవర్గ కన్వీనర్ శెట్టి మహేష్ హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన గిరిజన బిడ్డను జాతీయ కమిటీలో స్థానం కల్పించడం గర్వించదగ్గ విషయమన్నారు.సోలంకి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా నారాయణపేట నుంచి 2012 సంవత్సరంలో ప్రారంభమైన విద్యార్థి పరిషత్ సమరభేరి పాదయాత్ర కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు అనేక రకాల ఉద్యమాలతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసిన నాయకుడిగా శ్రీనివాస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

Advertisement

Next Story