- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి సొంత నిర్ణయమే.. సాఫ్ట్‌వేర్లకు తగ్గని క్రేజ్
దిశ, న్యూస్‌బ్యూరో: యువత తమ తోడును వెతుక్కోవడానికి సొంత నిర్ణయానికే ఓటేస్తున్నారు. ఎవరో చెబితే ఓకే చేసేందుకు ససేమిరా అంటున్నారు. 60శాతం మంది లైఫ్ పార్టనర్ ను సొంతంగానే ఎంచుకుంటామని స్పష్టం చేస్తున్నారు. భారత్ మాట్రిమోనీ తాజాగా వెల్లడించిన నివేదికను విడుదల చేసింది. 6లక్షల మంది కలిగిన ఈ సంస్థలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. వారిలో హైదరాబాద్, గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలకు చెందిన వారే అత్యధికం. 81శాతం ఇక్కడి వారైతే, 9శాతం మంది ఇతర పట్టణాలకు చెందిన వారు. 10శాతం మంది ఎన్ఆర్ఐలుగా ఉన్నారు.
నివేదికలోని అంశాలు
– 53శాతం మంది లైఫ్ పార్టనర్ వయసు 23 నుంచి 27 ఏండ్ల మధ్యనుండాలని కోరుకుంటున్నారు. 42శాతం మంది మాత్రం 26 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలంటున్నారు.
– 76శాతం మంది వారి ప్రొఫైల్స్‌ను యాప్ ద్వారానే రిజిస్టర్ చేయించుకున్నారు.
– లైఫ్ పార్టనర్ ఇతర కులాలకు చెందిన వారైనా సరేనని కేవలం 8 శాతం మంది మహిళలు, 10శాతం మంది పురుషులు చెప్పారు.
– సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేసే వారే భాగస్వాములు కావాలని అమ్మాయిలు కోరుతున్నారు.
– లైఫ్ పార్టనర్ రాష్ట్రేతరులైనా ఫర్వాలేదని 67 శాతం మహిళలు, 64 శాతం పురుషులు అభిప్రాయపడుతున్నారు.
– కేవలం తెలుగు మాట్లాడే లైఫ్ పార్టనర్ కావాలని కోరే వారి సంఖ్య 23 శాతం మంది మహిళలు, 26శాతం మంది పురుషులు ఉన్నారు.
– మాట్రిమోనీ సైట్‌లో అత్యధికం ఇంజినీరింగ్ చేసిన వారే. వారి సంఖ్య 42శాతం మహిళలు , 36.8 శాతం మంది పురుషులు ఉన్నారు. ప్రొఫెషనల్ డిగ్రీలు చేసిన వారిలో కేవలం 14.5 శాతం మహిళలు, 9శాతం పురుషులు ఉన్నారు.