- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ముద్దు’ ప్రేమాయణం
దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్ ఆఫీసుల్లో జరిగే సరదా సరదా అల్లర్లు, లవ్ స్టోరీస్, వర్క్ ప్రెజర్స్, పూర్తిస్థాయిలో సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలియక ఎంప్లాయిస్ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్..వంటి విషయాలను ‘కామిక్ వే’లో ప్రజెంట్ చేసిన షార్ట్ ఫిలిం సిరీస్ ‘ది సాఫ్ట్‌వేర్ డెవలపర్’. మొదటి నాలుగు పార్ట్స్‌తో ఈ సిరీస్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఇటీవలే విడుదలైన నాలుగో పార్టు 4 రోజుల్లోనే 14 లక్షల వ్యూస్ రాబట్టడం విశేషం.
షణ్ముఖ్.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హారిక, మనోహర్, డాన్, వైష్ణవి అతడి టీమ్ సభ్యులు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆఫీస్‌కు ట్రెడిషనల్ లుక్‌లో వచ్చిన వైష్ణవిని మొదటిసారి చీరలో చూసిన షణ్ముఖ్ తెగ ఆనందపడిపోతాడు. ఎప్పటి నుంచో వైష్ణవిని ఇష్టపడుతున్న తను, చూపు వాల్చకుండా ఆమె వైపే తదేకంగా చూస్తూ మురిసిపోతుంటాడు. ఆఫీస్‌లో పూజా కార్యక్రమం తర్వాత వైష్ణవిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తూ.. జర్నీలో వైష్ణవి చేతి మీద చేయి వేసి.. ఆమె దిగే ముందు ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. ప్రపోజ్ చేస్తాడేమోనని వైష్ణవి సందేహిస్తుంది కానీ, షణ్ముఖ్ ‘ఐ వాంట్ టు కిస్ యూ’ అంటాడు. వైష్ణవి షాక్ అవుతుంది. ఇదంతా ‘ది సాఫ్ట్‌వేర్ డెవలపర్’ మూడో పార్ట్ స్టోరీ.
ఇక నాలుగో పార్ట్ విషయానికొస్తే.. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆఫీస్‌లో షణ్ముఖ్ పక్కనే ఉండే తన సీటును అపోజిట్ ప్లేస్‌కు మార్చుకుంటుంది వైష్ణవి. ఈ క్రమంలోనే టీమ్ మేట్ హారికను, తన లవర్ డాన్ ఎలా ప్రపోజ్ చేశాడో చెప్పమంటుంది. సింపుల్‌గా బైక్ మీదొచ్చి ‘ఐ లవ్ యూ’ చెప్పి పారిపోయాడని చెప్పిన హారికను.. ప్రపోజ్ చేసేప్పుడు లవ్ యూ కాకుండా ‘ఐ వాంట్ టు కిస్ యూ’ అని ప్రపోజ్ చేస్తారా? అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఈ విషయాన్ని టీమ్ సభ్యులకు చెప్పిన షణ్ముఖ్.. వైష్ణవితో మాట్లాడేందుకు కాన్ఫరెన్స్ హాల్‌కు వెళ్లిన టైమ్‌లోనే, ఓ ప్రాబ్లమ్ వస్తుంది. కోడింగ్ విషయమై మనోహర్ తప్పు చేశాడని మేనేజర్ అరవింద్ సీరియస్ అవుతాడు. ఆ తర్వాత కష్టపడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, మనోహర్‌కు ‘ఐరన్ మ్యాన్’ గురించి షణ్ముఖ్ చెప్పిన సందర్భం ‘ఫ్రెండ్‌షిప్’ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. హృద్యంగా సాగిన ఈ ఫిల్మ్ చివరలో ఓ వుమన్(‘గర్ల్ ఫార్ములా’ దివ్య విద్య) ఎంటరై, ఏంటందరూ సీరియస్‌గా ఉన్నారు? అన్న డైలాగ్‌తో ఎండ్ అవుతుంది.
ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లుగా వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ మెయిన్ రోల్స్‌లో షణ్ముఖ్ జశ్వంత్, వైష్ణవి చైతన్య సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. దర్శకుడు సబ్బు కె.. కథ, మాటలు అందించగా, వంశీ శ్రీనివాస్ ఫొటోగ్రఫీలో ప్రతి ఫ్రేమ్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. సుమన్ వంకర మ్యూజిక్ ఆద్యంతం అలరించింది. కాగా, సెప్టెంబర్ 8న నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఇక ‘గర్ల్ ఫార్ములా’ దివ్య విద్య.. తొలిసారి షన్ముఖ్ అండ్ టీమ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. ఇందులో హెచ్‌ఆర్‌గా ఎంటర్‌టైన్ చేయబోతుంది. దీంతో దివ్య విద్య ఫ్యాన్స్ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అన్న మాట.