హుజురాబాద్ బై పోల్ : ప్రచారంలో రచ్చ రచ్చ

by Anukaran |
Huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసుకునే పరిస్థితి నుండి ఫేక్ వార్తలు క్రియేట్ చేసే వరకు చేరింది ప్రత్యర్థుల ప్రచారం తీరు. తమ పార్టీ గొప్పతనాన్ని వివరించడం కన్నా ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎత్తి చూపడం నుండి ఫేక్ న్యూస్ క్లిప్పింగ్స్ ను తయారు చేసి ప్రజల్లోకి పంపించే సంస్కృతికి చేరింది. దీంతో ఏది నిజం ఏది అబద్దం అన్న విషయం అర్థం కాక సామాన్యుడు గందరగోళంలో పడిపోతున్నాడు. నిన్న మొన్నటి వరకు తమ ప్రచారం కోసం ఉపయోగించుకున్న సోషల్ మీడియా బృందాలను ఇప్పుడు తప్పుడు ప్రచారాలకు వాడుకుంటున్నారన్న చర్చ సాగుతోంది.

హుజురాబాద్ వేదికగా…

ఉప ఎన్నికలు జరగనున్న హుజురాబాద్ కేంద్రంగా అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా టీమ్స్ ను రంగంలోకి దింపాయి. పార్టీల ప్రచారం కన్నా ముందే ఈ బృందాలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థులపై పలు పోస్టులు క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు క్యారికేచర్స్ తో కామెంట్స్ చేసే విధానానికి భిన్నంగా సాగుతోంది. ఏకంగా న్యూస్ పేపర్లలో ప్రకటనలు ఇచ్చినట్టుగానే క్రియేట్ చేసి మరీ ఫలానా పత్రికలో ఫలానా నాయకుని వ్యాఖ్యలు ఇవి సమంజసమేనా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలపై ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేందుకు కూడా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా స్పష్టం అవుతోంది. అంతేకాకుండా తమ పార్టీ వారిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా కూడ తప్పని వివరిస్తూ కౌంటర్ పోస్టింగ్ లు చేసేందుకు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్స్ ను ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి తయారైంది.

సామాన్యుడి పరేషాన్…

ఒకరిపై ఒకరు బహిరంగ సభల్లో దుమ్మెత్తి పోసుకునే విధానంతో పాటు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఫేక్ న్యూస్ పరంపరతో సామాన్యులు పరేషాన్ లో పడుతున్నారు. వాస్తవం ఏంటీ అన్న విషయం అర్థం కాక పోస్టింగ్స్ గురించి చర్చించుకునేందుకు కూడా సాహసించడం లేదు. కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ తో మాత్రం తాము లాభ పడతామంటే తాము లాభ పడతామని లెక్కలు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి రాజకీయ పార్టీలు.

huzurabad social media

huzurabad social media

huzurabad social media

huzurabad social media

Advertisement

Next Story

Most Viewed