టైరులో దూరిన కొండచిలువ..

by vinod kumar |
టైరులో దూరిన కొండచిలువ..
X

దిశ, వెబ్ డెస్క్: ఎక్కడా చోటుచేనట్లు ఓ పాము కారు టైరులోకి దూరింది. అదికూడా ఓ మహిళ కారులోకి. టైరులో ఎన్నడూ లేని విధంగా ఏదో కదులుతోందని తొంగి చూసిన ఆమెకు అందులో పాము కనిపించింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సాయం కోరింది. ఈ ఘటన మెక్సికోలోని రాస్వేల్‌లో చోటుచేసుకుంది.

హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. దాన్ని బయటకు తీయడానికి ఎంతో శ్రమించారు. అంతలోపే అది టైరు నుంచి కారు ఇంజిన్లోకి దూరింది. దీంతో పోలీసులు దాన్ని పట్టుకుని యానిమల్ సర్వీస్‌కు అప్పగించారు. ఈ ఘటనను పోలీసులు తమ ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్టు చేశారు. ఆ పాము పొడవు 3 అడుగులు ఉందని వివరించారు.

నాలుగు రోజుల్లో ఆ పాము యజమాని దాన్ని తీసుకోడానికి రాకపోతే.. ఎవరికైనా దత్తతకు ఇచ్చేస్తామని పోలీసులు పేర్కొనడం గమనార్హం. ఎందుకంటే.. అక్కడ కుక్కలు, పిల్లులు పెంచుకున్నట్లే కొందరు లావుగా, బొద్దుగా ఉండే కొండ చిలువలను కూడా పెంచుకుంటారు. ఈ ఘటన జరిగింది సిటీలోనే కనుక.. అది ఖచ్చితంగా పెంపుడు పామేనని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Next Story