- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'మొబైల్' ట్రాకింగ్… 'సోషల్' చెకింగ్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రభావం చూపిస్తోందని… ప్రాణాలకు ముప్పుందని… కనీస జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు సూచనలు అందిస్తున్నా… కొందరు పట్టించుకోవడం లేదు. ‘సామాజిక దూరం’ ఖచ్చితంగా పాటించి కరోనాను నిర్మూలిద్దామని పిలుపునిస్తున్నా లెక్కచేయడం లేదు. ‘సోషల్ డిస్టెన్సింగ్’ మెయింటైన్ చేయకపోతే ప్రభుత్వానికి తెలుస్తుందా? వచ్చి ప్రశ్నిస్తుందా? అని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. కానీ అంతొద్దు బాబు … మీరు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారా? లేదా? అనేది తెలిసిపోతుంది. మీ మొబైలే మిమ్మల్ని పట్టిస్తోంది. జీపీఎస్ ద్వారా మీ గురించి మేము కనిపెడుతున్నాం కదా అని హెచ్చరిస్తోంది అమెరికాలోని ఓ కంపెనీ.
అవును … మీ ఫోన్ చెప్పేస్తోంది మీరు సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నారా? లేదా? అని. అమెరికాలోని ఓ డాటా కలెక్షన్ కంపెనీ స్మార్ట్ ఫోన్స్ జీపీఎస్ డాటా ఆధారంగా 127 మిలియన్ మంది ప్రజలను ట్రాక్ చేస్తోంది. సామాజిక దూరాన్ని ఎంత బాగా పాటిస్తున్నారో తెలుసుకునేందుకు గాను.. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు, తర్వాత వారు ప్రయాణించిన దూరాన్ని మానిటర్ చేస్తోంది. ఆ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా అమెరికాలోని రాష్ట్రాలకు సోషల్ డిస్టెన్సింగ్ స్కోరు( గ్రేడ్స్) జారి చేస్తోంది. 40శాతం అంతకు మించి ప్రయాణ దూరం తగ్గించిన రాష్ట్రాలకు A గ్రేడ్…. పది శాతానికి తక్కువ ప్రయాణ దూరాన్ని తగ్గించిన రాష్ట్రాలకు F గ్రేడ్ ఇస్తోంది. నార్వేలో ఉన్న ఈ కంపెనీ.. యురోపియన్ యూనియన్స్ జనరల్ డాటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్, కాలిఫోర్నియా కన్జ్యూమర్ ప్రైవసీ యాక్ట్‌కు లోబడి పనిచేస్తుందని తెలిపింది. కేవలం సెలెక్టెడ్ మెంబర్స్‌ను ట్రాక్ చేయడం లేదని.. మా దగ్గర ఉన్న డాటా ఆధారంగానే మానిటరింగ్ జరుగుతుందని స్పష్టం చేసింది.
tags : Social Distancing, CoronaVirus, Covid 19