దుబ్బాకలో మరోసారి టీఆర్ఎస్ Vs బీజేపీ.. మంత్రి ముందే హోరెత్తిన నినాదాలు.. వీడియో

by Anukaran |   ( Updated:2023-05-19 08:27:38.0  )
Dubbaka
X

దిశ ప్రతినిధి, మెదక్ : దుబ్బాకలో అధికార పార్టీయైన టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీయైనా బీజేపీ కార్యకర్తలు హోరాహోరీగా నినాదాలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో దుబ్బాక పాత బస్టాండ్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. బుధవారం దుబ్బాక కొత్త బస్టాండ్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావులు హాజరయ్యారు.

ఈ సమయంలో అధికార పార్టీ నాయకులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేయగా.. వెనువెంటనే బీజేపీ నాయకులు భారత్ మాతాకి జై అంటూ పెద్ద యెత్తున నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు దుబ్బాకలో ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఇరు వర్గాలు హోరాహోరీగా నినాదాలు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు వెనువెంటనే ఇరు పార్టీల కార్యకర్తలను సముదాయించారు. దీంతో ప్రశాంత వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed