చైనా సరిహద్దులో పరిస్థితులు అదుపులోనే: ఆర్మీ చీఫ్

by Shamantha N |
చైనా సరిహద్దులో పరిస్థితులు అదుపులోనే: ఆర్మీ చీఫ్
X

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు ఎల్ఏసీ(వాస్తవాధీన రేఖ)వద్ద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె ప్రకటించారు. రెండు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు సమసిపోయాయని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని తెలిపారు.

మన సరిహద్దులోకి చైనా మిలిటరీ చొరబడి, భారత మిలిటరీ పెట్రోలింగ్‌కు ఆటంకాలు కలిగిస్తోందని, సరిహద్దుకు సమీపంలో చైనా ఆర్మీని మోహరింపజేస్తున్నదన్న వాదనల నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మే తొలినాళ్లలో మొదలైన ఈ ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు ఇరుదేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. మిలిటరీ కమాండర్ స్థాయిలో మొదలైన ఈ చర్చలు సానుకూల ఫలితాలనిస్తున్నాయని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు మొదలైన ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed