- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎన్ కౌంటర్‌పై విచారణ.. కమిషన్ ఎందుకు అలా చేసింది
దిశ, ఫారూక్నగర్: దిశ ఎన్ కౌంటర్ సంఘటనపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ ఎట్టకేలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చేరుకుంది. షాద్ నగర్ బైపాస్ హైవే రోడ్డుపై భారీ భద్రతతో వాహనాల ద్వారా వచ్చిన కమిషన్ సభ్యులు జరిగిన సంఘటన స్థలం నుంచి రోడ్డు మార్గం ద్వారానే ఆగకుండా పరిశీలించారు.
కాన్వాయ్ వాహనాలు హైదరాబాద్ నుంచి షాద్ నగర్ చేరుకొని రసోయ్ చౌరస్తాలో యూటర్న్ తీసుకుని అంతే వేగంగా హైదరాబాద్ వైపు వెళ్ళిపోయింది. అదేవిధంగా సంఘటనా స్థలం వద్ద స్థానిక పోలీసులు మోహరించారు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చేరుకున్నాయి. అయితే సిర్పూర్కర్ కమిషన్ వస్తున్న సందర్భంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కమిషన్‌ను కలవాలని కొంతమంది ప్రజాసంఘాల నాయకులు సైతం వేచి చూశారు. కానీ కమిషన్ సభ్యులు బైపాస్ రోడ్డు మార్గం ద్వారా వచ్చి అదే దారిలో ఆగకుండా వెళ్లిపోయారు. అక్కడ ఏం జరుగుతుందో మీడియాకు గాని స్థానిక పోలీసులకు గాని అర్థం కాలేదు. కమిషన్ కేవలం రోడ్డు మార్గం ద్వారా వచ్చి వెళ్లడంతో ఏం జరిగింది అనేది తెలియరాలేదు.