అలీ జాఫర్‌పై లైంగిక ఆరోపణలు.. మీషాకు మూడేళ్లు జైలు

by Shyam |
Pakistani singer Meesha Shafi, Singer Ali Zafar
X

దిశ, సినిమా: పాకిస్థానీ నటుడు, సింగర్ అలీ జాఫర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆ దేశానికే చెందిన సింగర్, నటి మీషా షఫీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోపణల వల్ల తన పరువుకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఒక బిలియన్ పాకిస్థానీ రూపాయల(రూ.55 కోట్లు)కు పరువునష్టం దావా వేసిన అలీ.. నిరాధార ఆరోపణలతో తన జీవనాన్ని దెబ్బ తీసిందని సదరు పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఆ కేసుకు సంబంధించిన తీర్పు తాజాగా వెల్లడి కాగా, మీషాకు కోర్టు జైలు శిక్ష విధించింది.

2018లో ‘మీ టూ(#MeeToo)’ ఉద్యమంలో ఎంతోమంది సెలబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి. ఈ క్రమంలోనే సింగర్ జాఫర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ, నటి మీషా ఆరోపణలు చేసింది. ఆమె ఆరోపణలను అలీ ఖండించడంతో పాటు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా ఒకరిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని.. ఈ రకమైన దూషణలు, ఆరోపణలు కుటుంబ, పరిశ్రమ పరంగానూ గౌరవాన్ని దెబ్బతీస్తాయన్నాడు. ఎప్పుడైనా న్యాయం వైపే ఉంటానని, ఈ ఆరోపణలను చట్టపరంగానే ఎదుర్కొవడానికే తాను మీషాపై పరువునష్టం దావా కేసు వేశానని తెలిపాడు. కాగా తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు అలీ కెరీర్‌కు కోలుకోలేని నష్టాన్ని కలిగించినందుకు పాకిస్తాన్ కోర్టు మీషాకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

Advertisement

Next Story

Most Viewed