- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింహాచలం దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు
దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఐఎస్‌వో గుర్తింపు లభించింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించడంతోపాటు పచ్చదనం, పరిశుభ్రతకు గానూ ఈ గుర్తింపు లభించింది. ఈ ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను ఆలయ ఈవో సూర్యకళకు మంత్రి అవంతి శ్రీనివాసరావు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రసాదం పథకానికి కూడా ఈ దేవాలయం ఎంపికైంది. ఇందుకు గానూ కేంద్రం రూ.53 కోట్లు నిధులు మంజూరు చేసింది.
ఈ నిధులతో దేవాలయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆలయ ఈవో సూర్యకళ వెల్లడించారు. సింహాచలం దేవస్థానం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం. ఏడాదికి 12 గంటలు మాత్రమే ఈ దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని పిలుస్తుంటారు. ప్రతీ ఏడాది వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది.