బిగ్ బ్రేకింగ్: గుండెపోటుతో బిగ్ బాస్ విన్నర్ మృతి

by Anukaran |   ( Updated:2021-09-02 01:39:44.0  )
బిగ్ బ్రేకింగ్: గుండెపోటుతో బిగ్ బాస్ విన్నర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, హిందీ బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం ఆయన గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. 40 ఏళ్లకే సిద్ధార్థ్ శుక్లా మృతిచెందడం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ‘బాలికా వధు’ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ ఆనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ తెలుగులో ‘చిన్నారి పెళ్లి కూతురు’గా డబ్ అయిన విషయం తెలిసిందే.

ఇక పలు సినిమాలలో నటించిన సిద్దార్థ్ గత సీజన్ బిగ్ బాస్ 13 విజేతగా నిలిచి స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నాడు. దీంతో సిద్దార్ధ్ శుక్లాకు వరుస సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్ అవకాశాలు వచ్చాయి. ఇక ఇటీవలే సిద్ధార్ధ్ నటించిన ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3’ వెబ్ సిరీస్ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చిన్న వయసులోనే సిద్దార్థ్ హఠాత్ మరణం బాలీవుడ్ ని కుదిపేసింది. ఎంతో ఆరోగ్యంగా, సిక్స్ ఫ్యాక్ బాడీతో కనిపించే సిద్దార్థ్ శుక్లా మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

Next Story