- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR కాళ్లు 100 సార్లు మొక్కుతా.. మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : తాను రాజకీయ రంగ ప్రవేశం చేయడంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సిద్దిపేట మాజీ కలెక్టర్ ఎట్టకేలకు స్పందించారు. గురవారం ఇందిపార్కు వద్ద జరుగుతున్న టీఆర్ఎస్ ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన పొలిటికల్ ఎంట్రీపై ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. రైతులు కష్టపడి పండించిన పంటను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయదు, రైతులు వరి పండించ కూడదు అనడం ఎంతవరకు కరెక్ట్, ఇలా ఒక్కసారిగా వరి పండిచవద్దు అంటే రైతు పరిస్థితి ఏంటీ అని నిలదీశారు. అలాగే తాను రాజకీయ నేతగా ఎదిగిన తర్వాత మొదటిసారిగా రైతుల పట్ల ఉద్యమం చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పేదలకు తండ్రిలాంటి వారు, కేసీఆర్‌కు ఒక్కసారికాదు వందసార్లు పాదాభివందనం చేస్తాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా కేసీఆర్ నా పనితానికి మెచ్చి పదవులు ఇచ్చారని, అందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.