- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్టికల్ 370 రద్దుకు శ్యాంప్రసాద్ ముఖర్జీ కృషి
దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేశంలో ఒకే పౌరసత్వం, కాశ్మీర్‌లో అవరోధంగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు కోసం శ్యాం ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా కృషి చేశారని ఎమ్మెల్సీ రాం చందర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బీజేపీ ఆఫీస్‌లో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ దేశం నుంచి కాశ్మీర్‌ను విడదీసేందుకు ఉన్న ఆర్టికల్ 376 రద్దు కోసం 1953లోనే శ్యాంప్రసాద్ ముఖర్జీ పోరాడారని గుర్తు చేశారు. అంతకు ముందు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మొక్కను నాటి, ముఖర్జీ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పల్లె గంగారెడ్డి, సూర్యనారాయణ, యెండల సుధాకర్, ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, న్యాలం రాజు, ఆకుల హేమలత పాల్గొన్నారు.