- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారసత్వంపై శృతి కామెంట్
సూపర్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాన్న పేరు చెప్పి ఎంట్రీ ఇచ్చినా సరే.. తనకు తాను పోటీని తట్టుకుని నిలబడగలిగింది. బాలీవుడ్ ‘లక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ.. 11 ఏళ్లుగా బాలీవుడ్‌తో పాట సౌత్ ఇండస్ట్రీలోనూ రాణిస్తోంది. అటు మ్యూజిషియన్‌గా, సింగర్ గానూ గుర్తింపు తెచ్చుకుంది.
అయితే సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోజం గురించి చర్చ జరుగుతుండగా.. దీనిపై స్పందించింది బ్యూటీ. తను వారసత్వం ఉండటం వల్లే సినిమాల్లోకి సులభంగా రాగలిగాను అని ఒప్పుకుంది. కానీ ఎంటర్ అయ్యాక నిలదొక్కుకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో అందరికీ తెలుసంది. కెరియర్‌లో ఎన్నో అపజయాలు చూశానని.. తర్వాత సక్సెస్ బాట పట్టానని చెప్పింది. వారసత్వమనేది సినిమాల్లోకి వచ్చేందుకు ఉపయోగపడుతుంది కానీ.. ఇక్కడ రాణించాలంటే మాత్రం మన హార్డ్ వర్క్ కంపల్సరీ అని తెలిపింది. కొన్ని చోట్ల వారసత్వం ప్లస్ అయినా సరే.. గుర్తింపు రావాలంటే మాత్రం కృషి, పట్టుదల ఉండాలని అంటోంది శృతి.