- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రశ్న హీరోలనూ అడగండి : శ్రధ్ధ శ్రీనాథ్
జెర్సీ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రధ్ధ శ్రీనాథ్.. తాజాగా ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమాతో హిట్ అందుకుంది. నెట్ ఫ్లిక్స్, ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రంలో సత్యగా గుర్తుండిపోయే పాత్ర చేసింది శ్రద్ధ. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రద్ధ.. నెటిజన్లకు 10 మార్కుల ప్రశ్న వేసింది.
సినీ పరిశ్రమకు చెందిన తన స్నేహితుల్లో ఒక అమ్మాయి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, ఈ క్రమంలో ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి.. తనను పెళ్లి తర్వాత కూడా నటిగా కెరియర్ కంటిన్యూ చేస్తావా ? అని అడిగారని.. ఆ ప్రశ్న విన్నాక చాలా కోపం వచ్చినట్టు చెప్పింది. అంటే ఒక నటికి ఉన్న డిమాండ్ పెళ్లి తర్వాత తగ్గిపోతుందా? సూపర్ స్టార్ కాకుండా మామూలు హీరోయిన్‌కు సినిమాల్లో నటించాలనే కోరిక పెళ్లి తర్వాత తీరదా? అని ప్రశ్నించింది శ్రద్ధ. అదే పెళ్లయిన హీరోలు సినిమాల్లో రొమాన్స్ చేయకూడదని ఎందుకు ప్రశ్నించరు? అంటోంది.
కాగా దీనిపై స్పందించిన నెటిజన్లు.. ఇది తప్పుడు అభిప్రాయం అని కొందరంటుంటే.. నిజంగా ఇండస్ట్రీలో ఇదే జరుగుతోందని మరికొందరు చెప్పారు. దీనిపై స్పందించిన కన్నడ నటి హిత.. ఈ ప్రశ్న నన్ను చాలా మంది, చాలా సార్లు అడిగారని చెప్పింది. పెళ్లి అని తెలిసి, తనకు ఆఫర్స్ కూడా రాకుండా పోయాయంది హిత. కానీ టాలెంట్ ఉంటే మనల్ని క్యారెక్టర్స్ వెతుక్కుంటూ వస్తాయని తెలిపింది. తన విషయంలోనూ అదే జరిగిందని వెల్లడించింది. పెళ్లి తర్వాత హీరోయిన్‌గా రాణించలేరనే పద్ధతిని బ్రేక్ చేయాలని ఆకాంక్షించింది.
ఇక కేజీఎఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పెళ్లి తర్వాత ఆఫర్స్ ఉండవనేది అవాస్తవం అన్నారు. దియా సినిమాలో హీరోయిన్, ఒక బిడ్డను కలిగిన తర్వాత యాక్ట్ చేసిందని చెప్పారు. అయితే మాధురీ దీక్షిత్ లాంటి నిన్నటి తరం హీరోయిన్లు చాలా మంది పెళ్లి తర్వాత యాక్టింగ్ ఆపేశారని.. కరీనా కపూర్ మాత్రమే కొనసాగుతోందని చెప్పారు.