- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెన్నైలో పళనిస్వామిపై కాల్పులు

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో నడిరోడ్డుపై కాల్పులు జరిగాయి. కబాలి సినిమాను తలపించేలా ఓ వృద్ధుడు తన ప్రత్యర్థులపై తుపాకీతో ఫైరింగ్ చేశాడు. జనసందోహం ఉన్న ప్రాంతం కావడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోని పరుగులు తీశారు.
తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళనిలో వళ్లువర్ థియేటర్ యజమాని నటరాజన్ కు స్థానికంగా ఉండే పళనిస్వామితోపాటు మరో ఇద్దరితో విభేదాలు ఉన్నాయి. ఓ భూ వివాదంలో ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నటరాజన్ సోమవారం తన ప్రత్యర్థులైన పళనిస్వామి, సుబ్రమణిలపై నడిరోడ్డులో కాల్పులకు తెగపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నటరాజన్ ను అదుపులోకి తీసుకున్నారు.
Next Story