మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ

by Sridhar Babu |
మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ
X

దిశ, భద్రాచలం: మావోయిస్టులకు చర్లలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చర్ల పోలీస్‌స్టేష‌న్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్‌పి సునీల్‌దత్ సమక్షంలో గురువారం మధ్యాహ్నం 52 మంది లొంగిపోయారు. చర్ల మండలంలోని పూసుగుప్ప, బత్తినిపల్లి, భట్టిగూడెం, చెన్నాపురం గ్రామాలకు చెందిన మావోయిస్టు అనుబంధ మిలీషియా, గ్రామకమిటీ సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోయిన వారిలో ఉన్నట్లు ఎస్‌పి తెలిపారు. ఇందులో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ ఆధ్వర్యంలో గత ఏడాదికాలంగా వీరంతా పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలోని పెసర్లపాడు, పుట్టపాడు అటవీ ప్రాంతాలకు మావోయిస్టులు వీరిని తీసుకెళ్ళి శిక్షణ కూడా ఇప్పించినట్లుగా ఎస్‌పి తెలిపారు. సాయుధ ఉద్యమం పేరుతో మావోయిస్టులు పెట్టే వేధింపులు భరించలేక‌ లొంగిపోయినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఓఎస్‌డి తిరుపతి, భద్రాచలం ఏఎస్‌పి డాక్టర్ వినీత్, చర్ల సీఐ బి. అశోక్, ఎస్ఐలు రాజువర్మ, వెంకటప్పయ్యలతో పాటు సీఆర్‌పిఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed