నాగార్జున సాగర్‌లో జానారెడ్డికి షాక్

by Anukaran |   ( Updated:2021-01-24 04:39:04.0  )
నాగార్జున సాగర్‌లో జానారెడ్డికి షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా నాగార్జనసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి షాక్ తగిలింది. ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా జానారెడ్డికి ఆయన అనుచరుడు పార్టీకి గుడ్ బై చెప్పాడు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రవికుమార్ ప్రకటన చేశారు. జానారెడ్డి వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించాడు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరబోతున్నట్లు తెలిపారు.

నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జానారెడ్డి…ఉపఎన్నిక బరిలో ఉంటానని స్పష్టం చేశాడు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన జానారెడ్డి.. సాగర్‌లో మరోసారి విజయం సాధించి రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీయే ప్రత్యామ్నాయం అని నిరూపించాలని లెక్కలు వేసుకుంటున్నారు.

కానీ.. ఇటీవల బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత…దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి దూకుడు మీదుంది. ఇదేక్రమంలో సాగర్‌ను సైతం తమ ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. దీంతో అక్కడ త్రిముఖ పోరు నెలకొంది. అయితే జానారెడ్డికి చెందిన ప్రధాన అనుచరుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరికకు రెడీ కావడంతో.. సాగర్‌లో ఇంకా ఎలాంటి రాజకీయ వలసలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story