- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడప జిల్లాలో సీఎం జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌కు సొంత జిల్లాలోనే షాక్ తగిలింది. సీఎం వైఎస్ జగన్‌కు సన్నిహితుడు, కీలక నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కడప జిల్లాతోపాటు రాయచోటి రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు ఆరా తీశారు. టీడీపీ కార్యకర్తల స్థితిగతులను రాంప్రసాద్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కోసం అందరితో కలిసి తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ చంద్రబాబుకు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. జగన్ పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో విబేధాల నేపథ్యంలో ఆయన వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.