- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘శివన్న.. శివన్న’ అంటూ ‘పునీత్’ నన్ను పిలుస్తున్నాడు : శివరాజ్ కుమార్
దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (40) ప్రమాదవశాత్తు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పునీత్ మరణాన్ని ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ జ్ఞాపకార్థం మొన్న ఆ మధ్యలో బెంగళూరులో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అందులో పునీత్ రాజ్‌కుమార్ బాల్యం నుంచి పవర్ స్టార్ వరకు ఎలా ఎదిగారని ఓ వీడియోను ప్రదర్శించారు. ఆ దృశ్యాలను చూస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయులు, అభిమానులు కంట నీరు తెచ్చుకున్నారు. ఇక పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ మాత్రం ప్రోగ్రాం మొదటి నుంచి నాన్ స్టాప్‌గా తన ప్రియమైన తమ్ముడిని తలుచుకుంటూ ఏడ్చేశారట.. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
తాజాగా శివరాజ్ కుమార్ పునీత్ మరణంపై ఓ ఇంటర్య్వూలో చేసిన కామెంట్స్ అందరినీ కలిచివేశాయి. అందరి లాగానే తాను కూడా పునీత్ మాతో లేడనే నిజాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పారు. నా ప్రియ సోదరుడు నన్ను వదిలి వెళ్లిపోయాడని నమ్మడానికి ధైర్యం చాలడం లేదు. చాలా ప్రయత్నిస్తున్నా.. నా వల్ల కావడం లేదని ఎమోషనల్ అయ్యారు. తాను నమ్మకపోవడానికి తనకు చాలా కారణాలున్నాయన్నారు. ఇప్పటికీ పునీత్.. ‘శివన్న.. శివన్న’ అంటూ పిలుస్తున్నట్టు అనిపిస్తుందని అని చెప్పుకొచ్చాడు. పునీత్ గురించి నన్ను నేను దృష్టి మరల్చుకోవాలంటే సినిమాలు ఒక్కటే మార్గమని తెలిపారు.