- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Shilpa Shetty: శిల్పాశెట్టిపై నెటిజన్లు ఫైర్: భర్త జైలులో.. భార్య సంబురాల్లో
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి వినాయక చవితి వేడుకల్లో మునిగితేలారు. బుధవారం ఆమె వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి ఆటపాటలతో ఆడంబరంగా ఇంటికి తీసుకెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇటీవల భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయినప్పుడు మీడియా ముందుకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయినా శిల్పా ఇప్పుడు వినాయకుడి విగ్రహాన్ని ఇంత ఆడంబరంగా తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. చాలా రోజుల తర్వాత శిల్పా ఇలా బయటకు రావడంతో మీడియా తమ కెమెరాలకు పని చెప్పింది. ఆమె చుట్టూ చేరి ఫొటోలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇకపోతే ఈ వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. భర్త జైల్లో ఉన్న భాధ ఏ మాత్రం కనిపించడం లేదు.. ఇంకా పండగ చేసుకోవాడానికి రెడీ అయిపోయింది అని కొందరు.. ఇలాంటి గడ్డు సమయంలో ఇంత హంగామాగా విగ్రహాన్ని తీసుకెళ్లాలా..? అని మరికొందరు విమర్శిస్తున్నారు. మరోపక్క శిల్పాశెట్టిని ప్రశంసించేవాళ్ళు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితిలోనూ ఆచారాలను మరువకుండా శిల్పాశెట్టి పండగ జరుపుకోవాలనుకోవడం నిజంగా ప్రశంసించదగ్గ విషయమే అని కామెంట్స్ చేస్తున్నారు.
పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తరువాత శిల్పాశెట్టి పరువు మొత్తం పోయింది. దీంతో ఆమె, భర్త నుంచి విడిపోవాలని కోరుకుంటుందని, త్వరలోనే వారు విడాకులు తీసుకొనునట్లు సమాచారం. ఈ కారణంగానే శిల్పా, భర్త విషయాలను పట్టించుకోకుండా పిల్లలతో సరదాగా గడపాలని, మళ్లీ తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా భర్త ఇలా జైలు లో ఉన్నప్పుడు ఇంత హంగామా లేకుండా, మీడియా కంటపడకుండా వెళితే బావుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- mumabi